ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్
= ధరణి స్థానంలో భూమాత.. ప్రతి రైతుకూ భూధార్ కార్డు
= రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ.. రూ. 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం
= రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ
= డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం
= ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
= అంగన్ వాడీలకు వేతనం రూ. 18 వేలకు పెంపు
= కొత్తగా మూడు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు
= రైతులకు రూ. 24 గంటల ఉచిత కరెంటు
= కాళేశ్వరం ముంపు నివారణకు కరకట్టల నిర్మాణం
= అభయహస్తం పేరిట కాంగ్రెస్ (Congress) మ్యానిఫెస్టో రిలీజ్
హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ (Congress)పార్టీ ప్రకటించింది. అభయహస్తం పేరిట ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ కాంగ్రెస్(Congress) మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని పేర్కొన్నారు. ప్రతి రైతుకూ భూధార్ కార్డులను అందజేస్తామని తెలిపారు. రైతులకు ఉచితంగా 24 గంటల పాటు కరెంటు ఇస్తామని, ఎరువులు, పురుగు మందుల్లో సబ్సడీ ఇస్తామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాలు, బెడ్డ ను రద్దు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో మరో మూడు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేస్తామని, కాళేశ్వరం ముంపు నివారణకు కరకట్టలు నిర్మిస్తామని ప్రకటించారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందిస్తామని తెలిపారు.
అభయ హస్తం మ్యానిఫెస్టో కీలక అంశాలు..
ధరణి స్థానంలో భూమాత.. సమగ్ర కమతాల సర్వే చేపట్టి.. ఆధారంగా భూమిపై హక్కులు కల్పిస్తాం.. కోనేరు రంగారావు సిఫార్సులను అమలు చేస్తం
ప్రతి రైతుకూ భూధార్ కార్డు అందజేస్తం
ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములు రక్షిస్తం
రెవెన్యూ ట్రిబ్యునల్స్ పునరుద్ధరిస్తం
భూ తగాదాలు, వివాదాలు లేని పారదర్శక వ్యవస్థ తీసుకొస్తం
నిషేధి జాబితాలో చేర్చిన పట్టా భూములను వంద రోజుల్లో తొలగిస్తం
రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ.. కొత్త రేషన్ కార్డుల జారీ
రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చుతం
డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం+ కమీషన్ ఇస్తం
ఈజీఎస్ పని దినాలను 150 రోజులకు పెంచుతం.. కనీసం వేతనం రూ. 350కి పెంపు
మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు గౌరవ పెన్షన్
మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గౌరవ వేతనం పెంపు
పంచాయతీ సెక్రటరీల సర్వీసుల క్రమబద్ధీకరణ
ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు.. సకాలంలో డీఏ
ఉపాధ్యాయ బదిలీల కోసం ట్రాన్స్ ఫర్స్ క్యాలెండర్.. 317 జీవోపై ప్రత్యేక సమీక్ష సమస్య పరిష్కారానికి చర్యలు
ఆశ వర్కర్లు, ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులకు వేతనాల పెంపు.. ఉద్యోగ భద్రత
మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ
జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన కాంగ్రెస్(Congress)..
ఫిబ్రవరి1 నుంచి జూన్ 1 వరకు గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ
రైతులకు లక్షల వరకురుణ మాఫీ.. రూ. 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం
రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంటు
ధాన్యం కొనుగోళ్లలో తేమ, తాలు రద్దు
కాళేశ్వరం ముంపు నివారణకు కరకట్టల నిర్మాణం
సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రతి రోజూ ప్రజాదర్బార్
200 యూనిట్ల లోపు కరెంటు వాడే వారందరి ఇండ్లకు ఉచిత విద్యుత్
ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తం
హైదరాబాద్-మిర్యాలగూడ.. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు
ఫిన్ టెక్ ఇన్నోవేషన్ హబ్ గా వరంగల్.. రూ. 500 కోట్లతో అభివృద్ధి
భద్రాచలం.. ఆసిపాబాద్ లలో తేనెటీగల పెంపకం.. పరిశోధన సంస్థ ఏర్పాటు
నాగర్ కర్నూల్, జగిత్యాలలో సెరికల్చర్ పరిశోధన సంస్థ ఏర్పాటు
ఎన్ హెచ్ 44 వెంబడి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్ ఏర్పాటు
దేశంలోనే అగ్రగామి పాల బ్రాండ్ గా విజయ డెయిరీ అభివృద్ది
ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ, ఉద్యోగులకు పీఆర్సీ బకాయిల చెల్లింపు
ప్రతి ఆటో డ్రైవర్ కు ఏటా రూ. 12000 ఆర్థిక సాయం
ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు, ఆటోనగర్ ల ఏర్పాటు
పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానాలపై 50% రాయితీ కల్పిస్తం
బెల్ట్ షాపుల రద్దు.. మద్యం పాలసీలో మార్పులు
మత్తు బానిసల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాఉట
ఆడబిడ్డ వివాహానికి రూ. లక్ష సాయం.. ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఇస్తం..
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. 10 వేల గౌరవ వేతనం
ఎస్ హెచ్ జీలకు పావలా వడ్డీ రుణాలు
ప్రతి ఆడశిశువుకు ఆర్థిక సహాయంతో బంగారు తల్లి పథకం పునరుద్ధరణ
అంగన్ వాడీ టీచర్లకు రూ. 18 వేల వేతనం.. ఈపీఎఫ్ పరిధిలోకి తెచ్చి ఉద్యోగ భద్రత
ఎస్టీ జాబితాలోకి వాల్మీకి బోయలు
ముదిరాజ్, యాదవ, కురుమ, మున్నూరు కాపు, విశ్వకర్మ, పద్మశాలి, నాయీ బ్రాహ్మణ, రజక, పెరిక, సంచార జాతులకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు
బీసీ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేకంగా రాయితీలు
గొర్రెల కొనుగోలుకు రూ. 2 లక్షల సాయం
మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక సబ్ ప్లాన్
సింగరేణి కారుణ్య నియామకాలు పరిశీలించి సరళీకృతం
బీడీ కార్మికుల కోసం చేయూత పింఛన్
పద్మశాలీల కోసం సిరిసిల్లలో నూలు డిపోల ఏర్పాటు..
న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం
బార్ కౌన్సిల్ కు ఏటా వంద కోట్ల కేటాయింపు
సీఆర్పీసీలో సవరణు తెస్తం.. కేంద్రానికి సిఫార్సు చేస్తం
ప్రతి ప్రాక్టిసింగ్ న్యాయవాదికి ఇండ్ల స్థలాలు
100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు
మరణించిన జర్నలిస్టు కుటుంబానికి రూ. 5 లక్షల సాయం
రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్.. హెల్త్ కార్డులు, మెరుగైన వైద్యం
Read More:
- Mahmood Ali:మరో వివాదంలో మహమూద్ అలీ
- Director Shankar:భారతీయులెందరు
- Sreeleela:డాక్టర్ కావడమే ఫస్ట్ ప్రయార్టీ

