టీపీసీసీ చీఫ్ (TPCC Cheif) మహేశ్‌కుమార్ గౌడ్ ఇవాళ గాంధీభవన్‌లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కీలక ప్రకటన చేశారు. గతంలో పార్టీ విడిచిన నాయకులను తిరిగి ఆహ్వానిస్తూ “ఘర్ వాపసీ” చేపడతామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటు విలువైనదని గుర్తుచేశారు. త్వరలోనే ఖాళీగా ఉన్న పార్టీ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు (TPCC Cheif).
అదే విధంగా, విబేధాలు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, అక్కడి నేతలను ఒక్క తాటిపైకి తెచ్చే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ సమాచార వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. “నేను మెసేజ్ ఇస్తే రెండు నిమిషాల్లో గ్రామ కమిటీలకు చేరేలా చర్యలు తీసుకుంటాం” అని గౌడ్ తెలిపారు.
పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ సభలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు.
అలాగే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో కొత్త కంపెనీలను తీసుకొచ్చారని, ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్‌ల ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అందించిందని గుర్తు చేశారు.
ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, వంశీ కృష్ణ, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Also read: