Damodar: అవయవ మార్పిడి దందా ఆగాలె

Damodar

అవయవ దానానికి సంబంధించిన బిల్లును ఇవాళ మంత్రి (Damodar) దామోదర రాజనర్సింహా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా జరిగిన చర్చలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. బిల్లును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అవయవ మార్పిడి దందా ఆగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం 3,724మంది అవయవదానం కోసం ఎదురు చూస్తున్నట్లు (Damodar) తెలిపారు. ఈ బిల్లు ద్వారా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ కు అవయవదానం చేసే అవకాశం కలుగుతుందన్నారు. అదే సమయంలో అవయవాల మార్పిడి దందా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవచ్చన్నారు. అవయవదానం చేసిన డెడ్ బాడీకి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలన్నారు. అదే విధంగా ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు, వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో సీటు ఇవ్వాలని కోరారు.

నేను ముందుగా సంతకం చేస్త
ఎమ్మెల్యేలందరం అవయవదానం చేద్దామని, ఆ క్రమంలో తాను ముందు వరుసలో ఉంటానని బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఇవాళ సభలో అవయవదానం బిల్లుపై చర్చలో పాల్గొన్న కేటీఆర్… ‘ఎమ్మెల్యే అంటే రెండు లక్షల మందికి ప్రతినిధిగా ఉంటాం. కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ ముందుకొస్తే బాగుంటుంది. ఒకరోజు ఎమ్మెల్యేలందరినీ పిలిచి అవయవదానం చేసేందుకు సంతకాలు చేయించుకోవాలి. నేను ముందుగా సంతకం చేస్తాను. ఇది నా వ్యక్తిగత ప్రకటనగా చెబుతున్నాను’ అన్నారు.

Image

Also read: