ఫామ్‌హౌస్‌లో కేసీఆర్(KCR) నవగ్రహ మహాయాగం
సిద్దిపేట: గజ్వేల్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్(KCR) నవగ్రహ మహాయాగం చేపట్టారు. తన సతీమణి శోభతో కలిసి యాగానికి సంబంధించి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇందులో ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొనట్లు తెలుస్తోంది. రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఏర్పడటం, కేసుల ఇబ్బందుల కారణంగా పండితుల సూచన మేరకు మాజీ సీఎం యాగం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా కేసీఆర్(KCR) 2015లో చండీయాగం, 2018, 2023లో రాజశ్యామల యాగం చేపట్టిన సంగతి తెలిసిందే.

Also read :
POLICE: గోదావరిలో దూకిన కానిస్టేబుల్
