Batti: భూముల లూటీపై ఫోరెన్సిక్ ఆడిట్

Batti

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల లూటీపై ఫోరెన్సిక్ ఆడిట్ చేసి నిజాల నిగ్గు తేల్చుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Batti) చెప్పారు. ఇవాళ ఆయన మీడియాలో చిట్ చాట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో లక్షా యాభై వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు చేతులు మారాయని, భూదందాతో పోల్చితే కాళేశ్వరం అవినీతి నథింగ్ అని అన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారని చెప్పారు. పార్టీ బీ లో పెట్టి ఆ భూములన్నింటినీ సక్రమం చేసుకున్నారని తెలిపారు. ఇదో పెద్ద దందా అని అన్నారు. పార్ట్ బీలో తాము అనుకున్నవారిపై రిజిస్ట్రేషన్ చేశారని అన్నారు. కొన్ని చోట్ల ఆ భూయజమానులు ఇక్కడ లేరని, వారు పాకిస్తాన్ వెళ్లిపోయారని, అధికారులు నో ఆబ్జక్షన్ చెప్పారని దీంతో భారీగా చేతులు మారాయని అన్నారు. ధరణి వల్ల అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన భూమి ముగ్గురు నలుగురు వ్యక్తులు మీద బదలాయింపు అయిందన్నారు. అదంతా ఇప్పుడు వాళ్ల హక్కుగా మారిందని చెప్పారు. ప్రభుత్వం ఎన్ వోసి ఇచ్చినందున ఆ భూమి వాళ్లదయిందని, ఇలాంటి అన్నింటిపై ఫోరెన్సిక్ ఆడిట్ లో నిగ్గు తేలుస్తామని (Batti) చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల లూటీపై ఫోరెన్సిక్ ఆడిట్ చేసి నిజాల నిగ్గు తేల్చుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇవాళ ఆయన మీడియాలో చిట్ చాట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో లక్షా యాభై వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు చేతులు మారాయని, భూదందాతో పోల్చితే కాళేశ్వరం అవినీతి నథింగ్ అని అన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారని చెప్పారు. పార్టీ బీ లో పెట్టి ఆ భూములన్నింటినీ సక్రమం చేసుకున్నారని తెలిపారు. ఇదో పెద్ద దందా అని అన్నారు. పార్ట్ బీలో తాము అనుకున్నవారిపై రిజిస్ట్రేషన్ చేశారని అన్నారు. కొన్ని చోట్ల ఆ భూయజమానులు ఇక్కడ లేరని, వారు పాకిస్తాన్ వెళ్లిపోయారని, అధికారులు నో ఆబ్జక్షన్ చెప్పారని దీంతో భారీగా చేతులు మారాయని అన్నారు. ధరణి వల్ల అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన భూమి ముగ్గురు నలుగురు వ్యక్తులు మీద బదలాయింపు అయిందన్నారు. అదంతా ఇప్పుడు వాళ్ల హక్కుగా మారిందని చెప్పారు. ప్రభుత్వం ఎన్ వోసి ఇచ్చినందున ఆ భూమి వాళ్లదయిందని, ఇలాంటి అన్నింటిపై ఫోరెన్సిక్ ఆడిట్ లో నిగ్గు తేలుస్తామని చెప్పారు.

Also read: