టీజీపీఎస్సీ (TSPSC) గ్రూప్–1 ఫలితాలు విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవో నెంబర్ 29తో పాటు పలు రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రూప్ – 1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో తమ పిటిషన్లపై విచారణ జరిగే వరకు పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని (TSPSC) గ్రూప్ -1 అభ్యర్థులు కోరారు. పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. దీంతో అభ్యర్థులు చివరి నిమిషంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆఖరి నిమిషంలో పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీం కూడా తేల్చిచెప్పింది. హైకోర్టులో దీనిపై తేల్చుకోవాలని సూచించింది. ఆ తరువాత రేవంత్ సర్కార్ గ్రూప్-1 పరీక్షలను యదాదథంగా నిర్వహించింది. హైకోర్టులో గ్రూప్ – 1 అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణకు వచ్చింది. హైకోర్టులోనూ గ్రూప్-1 అభ్యర్థులకు చుక్కెదురే అయ్యింది. గ్రూప్-1 ఫలితాలను ఆపాలన్న అభ్యర్థుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుతో గ్రూప్ -1 ఫలితాలకు ఆటంకం తొలగినట్లైంది. ఈఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ -1 మెయిన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
టీజీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాలు విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవో నెంబర్ 29తో పాటు పలు రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రూప్ – 1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో తమ పిటిషన్లపై విచారణ జరిగే వరకు పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని గ్రూప్ -1 అభ్యర్థులు కోరారు. పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. దీంతో అభ్యర్థులు చివరి నిమిషంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆఖరి నిమిషంలో పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీం కూడా తేల్చిచెప్పింది. హైకోర్టులో దీనిపై తేల్చుకోవాలని సూచించింది. ఆ తరువాత రేవంత్ సర్కార్ గ్రూప్-1 పరీక్షలను యదాదథంగా నిర్వహించింది. హైకోర్టులో గ్రూప్ – 1 అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణకు వచ్చింది. హైకోర్టులోనూ గ్రూప్-1 అభ్యర్థులకు చుక్కెదురే అయ్యింది. గ్రూప్-1 ఫలితాలను ఆపాలన్న అభ్యర్థుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుతో గ్రూప్ -1 ఫలితాలకు ఆటంకం తొలగినట్లైంది. ఈఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ -1 మెయిన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Also read:

