తెలంగాణ రాజకీయాలు మరోసారి మత ప్రాతిపదికన చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత (HarishRao) హరీశ్ రావు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ మైనారిటీ సెల్ సమావేశంలో పాల్గొన్న ఆయన, “బడే భాయ్ – చోటే భాయ్ ఇద్దరూ ముస్లిం వ్యతిరేకులు” అంటూ సంచలన వ్యాఖ్యలు (HarishRao) చేశారు.
ముస్లింలకు ప్రాతినిధ్యం లేకుండా పాలన!
హరీశ్ రావు ఆరోపిస్తూ,
“ఢిల్లీ కేంద్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేరు. తెలంగాణలోనూ అదే పరిస్థితి. ఇది సెక్యులరిజం కాదు — ఇది ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరించడమే,”
అని మండిపడ్డారు. ముస్లింలను ఖాళీ వాగ్దానాలతో మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కేసీఆర్ పాలనలో మైనారిటీలకు మద్దతు
“మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలంలో ముస్లింల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు అయ్యాయి. షాదీ ముబారక్, ఇమామ్లకు తడ్కా, రంజాన్ తోఫా వంటి పథకాలతో ముస్లింలను గౌరవించారు,”
అని వివరించారు. దీనికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వాలు కేవలం హామీలతో పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు.
హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్
“ఓవైసీ స్కాలర్షిప్ పెంచుతామని చెప్పారు, విదేశాల్లో చదువుకునే ముస్లిం యువతకు రూ. 10 లక్షల లోన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ వాస్తవంగా ఒక్క రూపాయి అయినా వచ్చిన దాఖలాలే లేవు,”
అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది కరోడ్ పతిలా, చేసేది పకోడీలా ఉందని కేబినెట్ స్థాయి హాస్యం అంటూ ఎద్దేవా చేశారు.
ప్రజలు మార్పు కోరుతున్నారు
హరీశ్ రావు చివరగా మాట్లాడుతూ,
“ప్రజలంతా కాంగ్రెస్ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ముస్లింలు కూడా మోసపోవద్దని, భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ఆలోచించాలని కోరుతున్నాను”
అన్నారు.

Also read: