Telangana: హైదరాబాద్​పై డేగకన్ను

Telangana

జమ్మూకశ్మీర్​లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు చేసిన హెచ్చరికతో తెలంగాణ (Telangana) పోలీసు శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గుర్తించిన స్లీపర్‌ సెల్స్‌పై నిరంతరం నిఘా పెట్టాలని ఇంటెలిజెన్స్‌ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు. (Telangana) హైదరాబాద్‌లో పోలీసుల గస్తీని ముమ్మరం చేయాలని రాష్ట్ర పోలీసు శాఖను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఇవాళ, రేపు హెచ్‌ఐసీసీ కేంద్రంగా ‘భారత్‌ సమ్మిట్‌-2025’, అదే విధంగా మే 7 నుంచి 31 వరకు మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు జరగనున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

రాజన్న ఆలయంలో పోలీసుల తనిఖీలు
కేంద్ర నిఘా సంస్థల నుంచి అందిన హెచ్చరికలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జమ్మూకశ్మీర్​లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ పోలీసులను కేంద్ర నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు పుణ్యక్షేత్రాల వద్ద భద్రతను పెంచారు. ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడిని ఎస్​పీఎఫ్​ సిబ్బంది మెటల్ డిటెక్టర్​తో తనిఖీ చేసిన తర్వాతే దర్శనానికి లోపలికి అనుమతిస్తున్నారు. సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Image

Also read: