హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచానికి ఔషధ పరిశ్రమలో (Drugs) కీలక కేంద్రంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీలో కొత్తగా ఏర్పడిన ICAR బయాలజిక్స్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. (Drugs) ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో తయారయ్యే 33% వ్యాక్సిన్లు, 43% బల్క్ డ్రగ్స్ హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు.
హెల్త్‌కేర్‌లో హైదరాబాద్ ఘనత
కోవిడ్ సమయంలో ప్రపంచానికి అత్యవసరంగా వ్యాక్సిన్లు సరఫరా చేసిన ఘనత జీనోమ్ వ్యాలీ పారిశ్రామికవేత్తలదని సీఎం కొనియాడారు. “భారత దేశానికి మాత్రమే కాదు.. ప్రపంచానికి ఔషధ సరఫరాలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది” అన్నారు.
పారిశ్రామిక విధానం – మారని వేదం
పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరళ ఆర్థిక విధానాలు, వ్యవస్థాపిత పారిశ్రామిక ప్రోత్సాహక చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానం మాత్రం నిరంతర అభివృద్ధి దిశగా కొనసాగుతోందని వివరించారు.
పెట్టుబడుల ప్రవాహం – 3 లక్షల కోట్లకు పైగా
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ₹3,28,000 కోట్లు విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. “ఈ ఉత్సాహం కొనసాగితే రాబోయే పదేళ్లలో తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దగలమన్న ఆశ ఉంది” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
డేటా సిటీ లక్ష్యంగా హైదరాబాద్
భవిష్యత్తులో హైదరాబాద్‌ను డేటా సిటీగా అభివృద్ధి చేయడమే తమ తదుపరి లక్ష్యమని చెప్పారు. అధునాతన పరిశోధన, బయోటెక్నాలజీ, డేటా సైన్స్ రంగాల్లో తెలంగాణ మరింత ముందుకు వెళ్లేలా చర్యలు చేపడతామని చెప్పారు.
Also read: