సెమీకండక్టర్ పరిశ్రమలో కీలక పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. తెలంగాణలో (Hyderabad) ఉన్న అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుకూలమైన విధానాలు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయి. ఇవాళ సింగపూర్ సెమీకండక్టర్స్ ఇండస్ట్రీస్ అసోసియేషన్(ఎస్ఎస్ఏఐ) ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర (Hyderabad) రాజధానిని గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చనున్నామని సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులకు చెప్పారు.రాష్ట్రంలో సెమీ కండక్టర్స్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ చర్చల్లో రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమ స్థాపనకు అందుబాటులో ఉన్న అనుకూలమైన పరిస్థితులను మంత్రి శ్రీధర్ బాబు కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ప్రభుత్వ ఆహ్వానానికి ఎస్ఎస్ఐఏ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది చివర్లో సింగపూర్ నుంచి తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ను సందర్శించి, పరిశీలన జరుపుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఎస్ఐఏ చైర్మన్ బ్రియాన్ టాన్, వైస్ చైర్మన్ టాన్ యూ కాంగ్, సెక్రటరీ సీఎస్ చుహ తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.
సెమీకండక్టర్ పరిశ్రమలో కీలక పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. తెలంగాణలో ఉన్న అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుకూలమైన విధానాలు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయి. ఇవాళ సింగపూర్ సెమీకండక్టర్స్ ఇండస్ట్రీస్ అసోసియేషన్(ఎస్ఎస్ఏఐ) ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర రాజధానిని గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చనున్నామని సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులకు చెప్పారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్స్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ చర్చల్లో రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమ స్థాపనకు అందుబాటులో ఉన్న అనుకూలమైన పరిస్థితులను మంత్రి శ్రీధర్ బాబు కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ప్రభుత్వ ఆహ్వానానికి ఎస్ఎస్ఐఏ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది చివర్లో సింగపూర్ నుంచి తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ను సందర్శించి, పరిశీలన జరుపుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఎస్ఐఏ చైర్మన్ బ్రియాన్ టాన్, వైస్ చైర్మన్ టాన్ యూ కాంగ్, సెక్రటరీ సీఎస్ చుహ తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.
Also read:

