పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నాలు చేసి సావు డప్పు కొడతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (kaushik Reddy) హెచ్చరించారు. ఇవాళ బీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి (kaushik Reddy) , కోవా లక్ష్మీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పెట్టిన భిక్షతో గెలిచి ఇవాళ పార్టీ మారడం సిగ్గు చేటన్నారు. నిజంగా రోషం ఉంటే కడుపుకు అన్నం తింటుంటే, మీరు నిజంగా మొగోల్లు అయితే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలువాలని సవాల్ విసిరారు. ఎవరినీ కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఆ ముగ్గురి నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ వస్తాయని, వారి డిపాజిట్ గల్లంతవడం ఖాయమని పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలు మారారని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్పీకర్ టైమ్ ఇవ్వకపోవడంతో అనర్హత వేటు వేయాలని కోరుతూజిస్టర్ పోస్టులో పిటిషన్లు పంపామని తెలిపారు. కడియం, తెల్లం వెంకట్రావ్లపై పిటిషన్ ఇవ్వడానికి వెళితే అసెంబ్లీ కార్యదర్శి బాత్ రూమ్ లో దాక్కున్నారని ఆరోపించారు.

Also read:
- Saniya: సానియా మీర్జాతో స్మితా సబర్వాల్
- Dulkar Salman: లక్కీ దుల్కర్ సల్మాన్