Jagadeesh Reddy: రేవంత్ ముమ్మాటికీ బీజేపీ మనిషే

jagadeesh reddy

నల్గొండ: కేసీఆర్ పై అవాకులు చెవాకులు మాట్లాడితే కోమటిరెడ్డి బ్రదర్స్​లాగులు విప్పి కొడతామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadeesh Reddy) హెచ్చరించారు. ఇవాళ నల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. తాను నిఖార్సయిన ఉద్యమకారున్ని అని, ఫైటర్ నని అన్నారు. ప్రజల కోసం ఎన్ని సార్లయినా జైల్ కు పోయే దమ్మున్న నాయకుడినని ఆయన చెప్పారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదన్నారు. కోమటిరెడ్డి సోదరులకు నడమంత్రపు సిరి వచ్చి ఆగడం లేదని, వారికి బ్రోకర్లు అని పేరుందన్నారు. సాగర్ నీళ్లను ఆంధ్రాకు అమ్మి వైఎస్సాఆర్ వద్ద ముడుపులు తీసుకున్న వెధవలు కోమటిరెడ్డి సోదరులు అని ఫైర్​ అయ్యారు. అలాంటివాళ్లు కేసీఆర్ పై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్​ఇచ్చారు. కోమటిరెడ్డి అన్నదమ్ములు రేవంత్ బూట్లు తుడుస్తూ, సంక నాకుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీకి ఓటెయ్యాలని చెప్పిన దగాకోర్ కోమటిరెడ్డి అని ఫైర్​ అయ్యారు. తన చరిత్ర ఏంటో, వారి చరిత్ర ఏంటో చర్చకు పెడదామా అని సవాల్​ విసిరారు, కోమటిరెడ్డి సోదరుల బలుపును అణచుతామన్నారు. సంస్కారం లేని వెధవలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఈ లిల్లీపూట్ గాళ్ల బండారం బయటపెడతామన్నారు. రేవంత్ ముమ్మాటికీ బీజేపీ మనిషేనని, బీజేపీలోకి పోతాడని కాంగ్రెస్ మంత్రులే లీక్ లు ఇస్తున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమిస్తామని ఆయన హెచ్చరించారు.

సాగర్ నీళ్లను ఆంధ్రాకు అమ్మి వైఎస్సాఆర్ వద్ద ముడుపులు తీసుకున్న వెధవలు కోమటిరెడ్డి సోదరులు అని ఫైర్​ అయ్యారు. అలాంటివాళ్లు కేసీఆర్ పై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్​ఇచ్చారు. కోమటిరెడ్డి అన్నదమ్ములు రేవంత్ బూట్లు తుడుస్తూ, సంక నాకుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీకి ఓటెయ్యాలని చెప్పిన దగాకోర్ కోమటిరెడ్డి అని ఫైర్​ అయ్యారు. తన చరిత్ర ఏంటో, వారి చరిత్ర ఏంటో చర్చకు పెడదామా అని సవాల్​ విసిరారు, కోమటిరెడ్డి సోదరుల బలుపును అణచుతామన్నారు. సంస్కారం లేని వెధవలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఈ లిల్లీపూట్ గాళ్ల బండారం బయటపెడతామన్నారు. రేవంత్ ముమ్మాటికీ బీజేపీ మనిషేనని, బీజేపీలోకి పోతాడని కాంగ్రెస్ మంత్రులే లీక్ లు ఇస్తున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమిస్తామని ఆయన హెచ్చరించారు.

Also read: