కాళేశ్వరం (Kaleshwaram) కమిషన్ విచారణ వేగంగా సాగుతోంది. ఇవాళ అప్పటి సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ హాజరయ్యారు. వీళ్లద్దరూ కూడా కమిషన్ అడిగిన ప్రశ్నలకు నాకు తెలియదు.. ఇప్పుడు గుర్తుకు రావాడం లేదంటూ సమాధానాలు చెప్పడం గమనార్హం. (Kaleshwaram) సోమేశ్ కుమార్ ను ప్రశ్నిస్తున్న క్రమంలో ఆయన సూటిగా సమాధానాలు చెప్పకపోవడంతో కమిషన్ సీరియస్ అయ్యింది. మీరు డిబేట్ కు రాలేదు.. విచారణకు వచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ చురకలు అంటించారు.
కాళేశ్వరం కమిషన్ విచారణ వేగంగా సాగుతోంది. ఇవాళ అప్పటి సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ హాజరయ్యారు. వీళ్లద్దరూ కూడా కమిషన్ అడిగిన ప్రశ్నలకు నాకు తెలియదు.. ఇప్పుడు గుర్తుకు రావాడం లేదంటూ సమాధానాలు చెప్పడం గమనార్హం. సోమేశ్ కుమార్ ను ప్రశ్నిస్తున్న క్రమంలో ఆయన సూటిగా సమాధానాలు చెప్పకపోవడంతో కమిషన్ సీరియస్ అయ్యింది. మీరు డిబేట్ కు రాలేదు.. విచారణకు వచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ చురకలు అంటించారు.
స్మితా సబర్వాల్
ప్రశ్న: క్యాబినెట్ ఆమోదం లేకుండానే 3 బ్యారేజీలకు పర్మిషన్ల జీవో ఇచ్చారా
స్మిత: నా దృష్టిలో లేదు
కొన్ని ఫైల్స్ సీఎంవోకు రాకుండానే పరిపాలన అనుమతులు పొందాయా..?
స్మిత: నాకు తెలియదు
మూడు బ్యారేజీల పనులు కేబినెట్ ఆమోదం లేకుండానే స్టార్ట్ చేశారా..?
స్మిత: నాకు తెలియదు
దాచడానికేం లేదు.. నిజాలు మాత్రమే చెప్పాలి
స్మిత: సీఎంవోకు వచ్చే ప్రతి ఫైల్ పై స్మిత అప్రూవల్ ఉంటుంది. నేను పదేండ్ల పాటు సీఎం ఓలో సెక్రటరీగా పని చేశా.. ఏడు శాఖలను చూశాను. మై రోల్ ఈజ్ లిమిటెడ్.. జనరల్ కోఆర్డినేషన్ మాత్రమే.
మూడు గ్యారేజీలకు సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి నోట్స్ సీఎంఓ కి వచ్చాయా
స్మిత: నా దృష్టిలో లేదు.. నాకు ప్రస్తుతం గుర్తుకులేదు
సోమేశ్ కుమార్
మూడు బ్యారేజీల విషయంలో సీఎస్, ఇరిగేషన్ సెక్రెటరీగా ఉన్నప్పుడు ఏమైనా డీల్ చేశారా?
సోమేశ్: ఇరిగేషన్ సెక్రెటరీగా కొద్ది కాలమే ఉన్నా. సీఎస్ గా కేబినెట్ నిర్ణయాల మేరకు ముందుకు వెళ్లా
నిబంధనలకు వ్యతిరేకంగా3 బ్యారేజీల నిర్మాణాలు జరిగినట్లు ఏమైనా నోట్స్ గుర్తించారా ?
సోమేశ్: గుర్తుకు లేదు.. మర్చిపోయాను.. చాలా సంవత్సరాలు అయ్యింది కదా..
Also read:

