KAVITHA:నా అరెస్టు అక్రమం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత(KAVITHA) మార్చి 18, 2024 రోజున సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు విచారణ జరుగుతుండగానే తనను అక్రమంగా అరెస్టు చేసినట్లు కవిత(KAVITHA) పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఇవాళ ఆన్ లైన్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం (19 మార్చి 2024) రోజున సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ఈడీ ఆఫీసు నుంచి వెళ్లిపోయిన హరీశ్, కేటీఆర్
ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పరామర్శించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కాసేపు ఆమె తో మాట్లాడిన అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లి పోయారు.