తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ (Kavitha) కవిత కుమారుడు ఆదిత్య రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇవాళ జరిగిన బీసీ బంద్ కార్యక్రమంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. (Kavitha) ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ – “బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా ఇవ్వాలి. కేవలం నా అమ్మ కవిత ఒక్కరే పోరాడటం సరిపోదు. ప్రతి ఇంటి నుండి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలి” అని పిలుపునిచ్చారు.
ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు అవసరమని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో చదువుకున్న ఆదిత్య ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చారు. మొదటిసారి ప్రజా కార్యక్రమంలో పాల్గొనడంతో ఆయన ఎంట్రీపై ఆసక్తి పెరిగింది.
ఇక గతంలో బీఆర్‌ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందంటూ కవితను ఆమె తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో కవిత ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాంటి సమయంలో కవిత కుమారుడు ఆదిత్య రాజకీయ రంగంలోకి రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Also read:

