న్యాయస్థానాల్లో వాదనలు, తీర్పులు మాతృభాషలోనే ఉండాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఇవాళ ఆయన నోవాటెల్ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. తెలుగు భాష స్వచ్ఛమైనదని, ప్రపంచ భాషల్లో అందమైనదని అన్నారు. శాతవాహనులు, కాకతీయుల కాలంలో పరిఢవిల్లిందని (Kishan Reddy) అన్నారు. నిజాం కాలంలో అణచివేతకు గురైందని గుర్తు చేశారు. అప్పుడు ఆంధ్రమహాసభ వంటి సంస్థలు తెలుగు అమలు కోసం పోరాడాయని అన్నారు. యక్షగానం, బుర్రకథ, హరికథ కేవలం తెలుగుకే పరిమితమని చెప్పారు. అవధానం తెలుగు లేదా సంస్కృతంలోనే చేయగలరని అన్నారు. ఆంగ్ల వాడటం తప్పు కాదని, తెలుగును విస్మరించడం తప్పని అన్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తెలుగులోనే జరగాలని ఆకాంక్షించారు. చైనా వంటి దేశాల్లో మాతృభాష లోనే విద్య కొనసాగుతోందని చెప్పారు. భాషను భావితరాలకు వారసత్వంగా అందించాల్సిన బాధ్యత ప్రస్తుత తరంపై ఉందని అన్నారు. ప్రతి ఇంట్లో విధిగా పెద్ద బాలశిక్ష ఉండాలని చెప్పారు. పాలనా పరమైన ప్రత్యుత్తరాలు తెలుగులోనే కొనసాగాలని అన్నారు. అమ్మ, నాన్న అన్న పిలుపులో ఉండే ఆప్యాయత మమ్మీ, డాడీల్లో ఉండదనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలని అన్నారు.
న్యాయస్థానాల్లో వాదనలు, తీర్పులు మాతృభాషలోనే ఉండాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన నోవాటెల్ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. తెలుగు భాష స్వచ్ఛమైనదని, ప్రపంచ భాషల్లో అందమైనదని అన్నారు. శాతవాహనులు, కాకతీయుల కాలంలో పరిఢవిల్లిందని అన్నారు. నిజాం కాలంలో అణచివేతకు గురైందని గుర్తు చేశారు.
అప్పుడు ఆంధ్రమహాసభ వంటి సంస్థలు తెలుగు అమలు కోసం పోరాడాయని అన్నారు. యక్షగానం, బుర్రకథ, హరికథ కేవలం తెలుగుకే పరిమితమని చెప్పారు. అవధానం తెలుగు లేదా సంస్కృతంలోనే చేయగలరని అన్నారు. ఆంగ్ల వాడటం తప్పు కాదని, తెలుగును విస్మరించడం తప్పని అన్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తెలుగులోనే జరగాలని ఆకాంక్షించారు. చైనా వంటి దేశాల్లో మాతృభాష లోనే విద్య కొనసాగుతోందని చెప్పారు. భాషను భావితరాలకు వారసత్వంగా అందించాల్సిన బాధ్యత ప్రస్తుత తరంపై ఉందని అన్నారు. ప్రతి ఇంట్లో విధిగా పెద్ద బాలశిక్ష ఉండాలని చెప్పారు. పాలనా పరమైన ప్రత్యుత్తరాలు తెలుగులోనే కొనసాగాలని అన్నారు. అమ్మ, నాన్న అన్న పిలుపులో ఉండే ఆప్యాయత మమ్మీ, డాడీల్లో ఉండదనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలని అన్నారు.
Also read:

