ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అర్థమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలి మాటలకు తాను స్పందించబోనని (Kishan reddy) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు లాంటిదని అన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో 37 శాతం మంది బీజేపీని ఆదరించారని, ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల్లో విద్యావంతులు అండగా నిలిచారని అన్నారు. రేవంత్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం పక్కా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎకరాకు రూ.15 వేలు, యువతకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500, దళితులకు రూ.12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ఆ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. జీవో 317 కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అర్థమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలి మాటలకు తాను స్పందించబోనని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు లాంటిదని అన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో 37 శాతం మంది బీజేపీని ఆదరించారని, ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల్లో విద్యావంతులు అండగా నిలిచారని అన్నారు. రేవంత్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం పక్కా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎకరాకు రూ.15 వేలు, యువతకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500, దళితులకు రూ.12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ఆ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. జీవో 317 కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Also read:

