kishanReddy: కేటీఆర్ మద్దతు అవసరం లేదు

kishanReddy

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందన

ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కేటీఆర్ మద్దతు తమకు అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishanReddy)  స్పష్టంచేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా పార్టీ తమ వైఖరిని నిర్ణయించుకోవడం వారివిషయమని అన్నారు. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి పెట్టిన అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పి, బీసీ కంచ ఐలయ్యను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా దింపితే బాగుండేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, సెప్టెంబర్ 9లోగా రాష్ట్రానికి సరిపడా యూరియా ఇచ్చిన పార్టీకే ఓటు వేస్తామని పరోక్షంగా (kishanReddy) వ్యాఖ్యానించారు.

కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

ఈ వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి, “కేటీఆర్ మద్దతు ఎవరూ అడగలేదు, అవసరం కూడా లేదు” అని తేల్చిచెప్పారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, “వెంకయ్య నాయుడు పోటీ చేసినప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? జీఎంసీ బాలయోగికి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలిపినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా?” అని ప్రశ్నించారు.

యూరియా సరఫరా వివరాలు

రాష్ట్రంలో యూరియా కొరత లేదని, కేంద్రం రైతులకు సరఫరా చేయడానికి కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కరైకల్ పోర్టులో 10,000 మెట్రిక్ టన్నుల యూరియా, ఇఫ్కో నుంచి 15,000 మెట్రిక్ టన్నులు, క్రిభ్ కో నుంచి 17,500 మెట్రిక్ టన్నులు, రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ నుంచి 7,500 మెట్రిక్ టన్నులు వస్తున్నాయని వివరించారు. మొత్తంగా దాదాపు 50,000 మెట్రిక్ టన్నులు ట్రాన్సిట్‌లో ఉన్నాయని చెప్పారు. తెలంగాణకు 20 లక్షల మెట్రిక్ టన్నుల అవసరాన్ని కేంద్రం నెరవేర్చిందని, మరిన్ని 2 లక్షల మెట్రిక్ టన్నులను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.

రాజ్యాంగ సవరణపై వివరణ

130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రస్తావించిన కిషన్ రెడ్డి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర–రాష్ట్ర మంత్రులు ఎవరికైనా తీవ్రమైన నేరారోపణలపై అరెస్టయి 30 రోజులు జైలులో ఉంటే పదవిని కోల్పోవాలనే ఉద్దేశంతో ఈ సంస్కరణ తెచ్చామని చెప్పారు. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడేందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టామని, ఇది ఏ పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

FurtherMore: