కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి ప్రజలపై ఉన్న కేసులనుగాలికొదిలేశారని టీజేఎస్చీఫ్, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) అన్నారు. మేడిగడ్డ నిర్మాణానికి, డిజైన్ కి పొంతన లేదని.. ఆర్థిక అంశాల్లో గత ప్రభుత్వంనిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ కి రెండు సార్లు ఆధారాలు సమర్పించామని, బాధ్యులపై తప్పక చర్యలు తీసుకొని కఠిన శిక్షలు విధించాలని పేర్కొన్నారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీస్ లో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో కోదండరామ్ (Kodandaram) మాట్లాడారు. ‘తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గోదావరిలో సరైన నీరు లేవని ఈ ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద నిర్మిస్తామని రీడిజైన్ చేశారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఇంజినీర్ల కమిటీ చేశారు. తుమ్మిడిహెట్టి నీరు ఉపయోగించుకోవాలని వారు సూచించారు. లోతుగా విశ్లేషణ చేయకుండా హడావిడిగా పనులు ప్రారంభించారు. ఉపయోగించిన మెటీరియల్, నిర్వహణ సరిగ్గా లేదని క్యాట్నివేదిక కూడా ఇచ్చింది. తుమ్మిడిహెట్టి వద్ద వరకు తీసిన 8 వందల కోట్ల ఖర్చుతో చేపట్టిన కాలువలను కొంత పనులు చేస్తే.. నీటిని తీసుకువచ్చే అవకాశం ఉంది. కమిషన్ వేయమని అడిగిందే బీఆర్ఎస్ వాళ్లు. ఇప్పుడు అర్హత లేదనడం శోచనీయం. కేసీఆర్తెలంగాణ పదాన్ని పార్టీ నుంచి తీసేసిండు. ఉద్యమం సమయంలో నాపై చాలా కేసులున్నాయి. కేసుల చిట్టాను ఆనాడు ఆయనకు ఇచ్చి రద్దు చేయమని అడిగితే పట్టించుకోలే. ఇప్పుడు కేసులో నన్ను మినహాయిస్తే చాలు అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు’ అని మండిపడ్డారు.
‘తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గోదావరిలో సరైన నీరు లేవని ఈ ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద నిర్మిస్తామని రీడిజైన్ చేశారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఇంజినీర్ల కమిటీ చేశారు. తుమ్మిడిహెట్టి నీరు ఉపయోగించుకోవాలని వారు సూచించారు. లోతుగా విశ్లేషణ చేయకుండా హడావిడిగా పనులు ప్రారంభించారు. ఉపయోగించిన మెటీరియల్, నిర్వహణ సరిగ్గా లేదని క్యాట్నివేదిక కూడా ఇచ్చింది. తుమ్మిడిహెట్టి వద్ద వరకు తీసిన 8 వందల కోట్ల ఖర్చుతో చేపట్టిన కాలువలను కొంత పనులు చేస్తే.. నీటిని తీసుకువచ్చే అవకాశం ఉంది. కమిషన్ వేయమని అడిగిందే బీఆర్ఎస్ వాళ్లు. ఇప్పుడు అర్హత లేదనడం శోచనీయం. కేసీఆర్తెలంగాణ పదాన్ని పార్టీ నుంచి తీసేసిండు. ఉద్యమం సమయంలో నాపై చాలా కేసులున్నాయి. కేసుల చిట్టాను ఆనాడు ఆయనకు ఇచ్చి రద్దు చేయమని అడిగితే పట్టించుకోలే. ఇప్పుడు కేసులో నన్ను మినహాయిస్తే చాలు అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు’ అని మండిపడ్డారు.
Also read:

