KTR: కేసీఆర్ రారు.. నేనే వస్తా

KTR

రాష్ట్రంలో రాజకీయ సెగలు మళ్లీ ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాలకట్టు విసిరిన సవాల్‌కు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ (KTR) ఘాటు ప్రతిస్పందన ఇచ్చారు. రైతులకు వాస్తవంగా ఎవరు మేలు చేశారన్న విషయంపై ఎల్బీ స్టేడియం వేదికగా చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేటీఆర్ స్పందిస్తూ, “కేసీఆర్ రారు.. నేనే వస్తా” అంటూ బహిరంగంగా ప్రతిసవాల్ (KTR) విసిరారు.

ఈరోజు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, జూలై 8వ తేదీన ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌కి వస్తానని తెలిపారు. చర్చకు పూర్తి సిద్ధంగా ఉన్నానని, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.

కేటీఆర్ కీలక వ్యాఖ్యలు:

  • రైతుబంధు పథకం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కూడా ఈ పథకాన్ని ప్రశంసించిందన్నారు.

  • రేవంత్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న పాలనను “టైమ్ పాస్ పాలన”గా పేర్కొన్నారు.

  • చంద్రబాబు హయాంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శించారు.

  • కేసీఆర్ హయాంలో ఫ్లోరైడ్ సమస్య నివారణ, రూ. 30 వేల కోట్ల రుణమాఫీ, ఉచిత కరెంట్ వంటి పలు రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని చెప్పారు.

  • ప్రస్తుతం తెలంగాణలో రైతులు ఎరువుల కోసం క్యూలైన్లలో నిలబడుతున్న దుస్థితి ఉందని ఆరోపించారు.

  • బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • “బేసిన్ ఏంటో తెలియని వాడికి కేసీఆర్‌ను విమర్శించే హక్కు లేదని” మండిపడ్డారు.

  • కాంగ్రెస్ ప్రభుత్వం హరతులు పట్టి రాయలసీమకు నీళ్లను పంపిన సంగతి మరిచిపోవద్దని గుర్తు చేశారు.

ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాలు విమర్శలు, ప్రతివిమర్శల మోతతో నిండిపోతున్నాయి. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతల మధ్య తలెత్తిన ఈ వాగ్వాదం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. జూలై 8న కేటీఆర్ – రేవంత్ మధ్య చర్చ జరిగితే అది రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు కావొచ్చు.

Also read: