ప్రతిపక్షం అంటే తిట్లు, శాపనార్థాలు కాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని (Kunamneni) సాంబశివరావు అన్నారు. ఇవాళ సీపీఐ స్టేట్ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం ప్రజల పక్షాన నిలబడి నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. గత బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ 90 శాతం మెరుగైన పాలన ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాది 60 శాతం మార్కులతో పాస్ అయిందని కామెంట్ (Kunamneni) చేశారు. ప్రస్తుతానికి ఆ పార్టీకి ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తున్నామని అన్నారు ఒకవేళ సరైన రీతిలో పాలన కొనసాగించకపోతే ప్రజలే ఫెయిల్ మార్కులు వేస్తారన్నారు. ‘ ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ సుమోటోగా స్వీకరించి.. జ్యుడీషయల్ ఎంక్వైరీ చేయాలన్నారు.
ప్రతిపక్షం అంటే తిట్లు, శాపనార్థాలు కాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ సీపీఐ స్టేట్ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం ప్రజల పక్షాన నిలబడి నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. గత బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ 90 శాతం మెరుగైన పాలన ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాది 60 శాతం మార్కులతో పాస్ అయిందని కామెంట్ చేశారు. ప్రస్తుతానికి ఆ పార్టీకి ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తున్నామని అన్నారు ఒకవేళ సరైన రీతిలో పాలన కొనసాగించకపోతే ప్రజలే ఫెయిల్ మార్కులు వేస్తారన్నారు. ‘ ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ సుమోటోగా స్వీకరించి.. జ్యుడీషయల్ ఎంక్వైరీ చేయాలన్నారు. అమిత్షా 2026 నాటికి నక్సలిజాన్ని లేకుండా చేస్తం అంటే అర్ధం ఏంటీ.. ప్రశ్నించే వాళ్లకు బ్రతికే స్వేచ్ఛ లేదా..? ఎదురు కాల్పులు అన్ని ప్రభుత్వ హత్యలే. పోలీసులు ఎన్కౌంటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా ..? ఛత్తీస్ గఢ్ బార్డర్ లో జరిగిన ఎన్ కౌంటర్లో తెలంగాణ పోలీసులు ఎందుకు పాల్గొన్నారు..ప్రభుత్వం బాధ్యత వహించి సమాధానం చెప్పాలి. పదేండ్లు అధికారంలో ఉండి ఒక్క హామీని నెరవేర్చలేని బీఆర్ఎస్కు రుణమాఫీ గురించి అడిగే హక్కు లేదు. బీఅర్ఎస్ ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ వల్లనే అసలు హక్కు దారులకు ఇంకా రుణమాఫీ అందలేదు.’ అని కూనంనేని అన్నారు.
Also read:

