Kunamneni: కులం, మతం లొల్లి వద్దు

Kunamneni

తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు ప్రతిపాదనకు పూర్తి మద్దతు ఇస్తున్నామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని (Kunamneni) సాంబశివరావు చెప్పారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. వర్సిటీల మార్పు విషయంలో కులం, మతాల పేరును తీసుకు రావద్దని అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అందరం గౌరవిస్తామని చెప్పారు. తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేసిన వ్యక్తి పేరును ఆ వర్సిటీకి పెట్టడం సముచితమని అన్నారు. తెలంగాణలో కవులే లేరంటూ ఎద్దేవా చేసిన రోజుల్లో ఆయన 364 మంది కవుల రచనలతో కూడిన గోల్కొండ కవుల సంచిక తెచ్చారని గుర్తు చేశారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా గోల్కొడ పత్రికను నడిపారని అన్నారు. భారత దేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం అయ్యేందుకు చేసిన పోరాటంలో ఆయన పాల్గొన్నారని అన్నారు. గతంలో హెల్త్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ వర్సిటీల పేర్లు మార్చినప్పుడు రాని కులం ప్రస్తావని ఇప్పుడే రావడం బాధాకరమని అన్నారు. కమ్యూనిస్టు పార్టీల పత్రికల పేర్లు కూడా మారాయని, విశాలాంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఉంటే.. ఇక్కడ ప్రజాపక్షం పెట్టుకున్నామని అన్నారు. అలాగే ప్రజాశక్తిని ఏపీకి ఇచ్చి నవతెలంగాణ ఇక్కడ పెట్టుకున్నారని వివరించారు. పేర్ల మార్పిడిని కులాలకు, మతాలకు లింక్ పెట్టొద్దని (Kunamneni) అన్నారు.

Image

తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు ప్రతిపాదనకు పూర్తి మద్దతు ఇస్తున్నామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. వర్సిటీల మార్పు విషయంలో కులం, మతాల పేరును తీసుకు రావద్దని అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అందరం గౌరవిస్తామని చెప్పారు. తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేసిన వ్యక్తి పేరును ఆ వర్సిటీకి పెట్టడం సముచితమని అన్నారు. తెలంగాణలో కవులే లేరంటూ ఎద్దేవా చేసిన రోజుల్లో ఆయన 364 మంది కవుల రచనలతో కూడిన గోల్కొండ కవుల సంచిక తెచ్చారని గుర్తు చేశారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా గోల్కొడ పత్రికను నడిపారని అన్నారు. భారత దేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం అయ్యేందుకు చేసిన పోరాటంలో ఆయన పాల్గొన్నారని అన్నారు. గతంలో హెల్త్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ వర్సిటీల పేర్లు మార్చినప్పుడు రాని కులం ప్రస్తావని ఇప్పుడే రావడం బాధాకరమని అన్నారు. కమ్యూనిస్టు పార్టీల పత్రికల పేర్లు కూడా మారాయని, విశాలాంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఉంటే.. ఇక్కడ ప్రజాపక్షం పెట్టుకున్నామని అన్నారు. అలాగే ప్రజాశక్తిని ఏపీకి ఇచ్చి నవతెలంగాణ ఇక్కడ పెట్టుకున్నారని వివరించారు. పేర్ల మార్పిడిని కులాలకు, మతాలకు లింక్ పెట్టొద్దని అన్నారు.

Also read: