పార్లమెంట్ ఎన్నికల్లో (Elections) ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలిస్తే లవ్ జీహాదికి అడ్డగా జగిత్యాల మారుతుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ అన్నారు. ఇవాళ సారంగాపూర్ మండలం తుంగురు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. జీవన్ రెడ్డికి ఇది 15వ ఎలక్షన్ అని, ఎపుడు ఎలక్షన్ వచ్చినా ఇది లాస్ట్ ఎలక్షన్ (Elections) అని చెప్తుండని ఎద్దేవా చేశారు. జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డగా మారిందని ఆరోపించారు. ఎంపీగా ఎన్నికైన తరువాత తాను చెప్పిన పనులన్నీ చేశానని, కానీ గజ్వేల్‌కు కేసీఆర్ ఏం చేయకున్నా గెలిపించారన్నారు. గల్ఫ్ గోసలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం భద్రంగా ఉందన్నారు. మహిళల గ్రూపులకు లోన్లు ఇచ్చింది, వడ్డీ రాయితీ ఇచ్చింది మోడీయేనని చెప్పారు. రాజీవ్ గాంధీ బొమ్మ లేదని, ఆయుస్మాన్ భారత్ కార్డ్ లు ఇస్తలేరని మండిపడ్డారు. మామిడి రైతులను నాశనం చేయడమే కాక చక్కెర ఫ్యాక్టరీ మూతపడటానికి కారణం జీవన్ రెడ్డినే అని ఆరోపించారు. రొల్లవాగు ప్రాజెక్టు జగిత్యాల అసెంబ్లీకి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిదన్నారు. నిధులు, కమిషన్లు వస్తున్నాయయని కానీ నీళ్లు వస్తలేవన్నారు. రైతులకు రూ. 500 బోనస్ ఇస్తలేరని, కానీ తరుగు మాత్రం తీస్తున్నారన్నారు. 45 ఏండ్లలో జగిత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేసాడని ప్రశ్నించారు. ఈ ఎన్నిక ధర్మాన్ని, దేశాన్ని కాపాడే ఎన్నిక అని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలిస్తే లవ్ జీహాదికి అడ్డగా జగిత్యాల మారుతుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ అన్నారు. ఇవాళ సారంగాపూర్ మండలం తుంగురు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. జీవన్ రెడ్డికి ఇది 15వ ఎలక్షన్ అని, ఎపుడు ఎలక్షన్ వచ్చినా ఇది లాస్ట్ ఎలక్షన్ అని చెప్తుండని ఎద్దేవా చేశారు. జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డగా మారిందని ఆరోపించారు. ఎంపీగా ఎన్నికైన తరువాత తాను చెప్పిన పనులన్నీ చేశానని, కానీ గజ్వేల్‌కు కేసీఆర్ ఏం చేయకున్నా గెలిపించారన్నారు. గల్ఫ్ గోసలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం భద్రంగా ఉందన్నారు. మహిళల గ్రూపులకు లోన్లు ఇచ్చింది, వడ్డీ రాయితీ ఇచ్చింది మోడీయేనని చెప్పారు. రాజీవ్ గాంధీ బొమ్మ లేదని, ఆయుస్మాన్ భారత్ కార్డ్ లు ఇస్తలేరని మండిపడ్డారు. మామిడి రైతులను నాశనం చేయడమే కాక చక్కెర ఫ్యాక్టరీ మూతపడటానికి కారణం జీవన్ రెడ్డినే అని ఆరోపించారు. రొల్లవాగు ప్రాజెక్టు జగిత్యాల అసెంబ్లీకి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిదన్నారు. నిధులు, కమిషన్లు వస్తున్నాయయని కానీ నీళ్లు వస్తలేవన్నారు. రైతులకు రూ. 500 బోనస్ ఇస్తలేరని, కానీ తరుగు మాత్రం తీస్తున్నారన్నారు. 45 ఏండ్లలో జగిత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేసాడని ప్రశ్నించారు. ఈ ఎన్నిక ధర్మాన్ని, దేశాన్ని కాపాడే ఎన్నిక అని చెప్పారు.
Also read:

