నామినేషన్ల ఉపసంహరణల పర్వం ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలిపోయింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ (Lok Sabha) స్థానాలకు 893 నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇందులో 268 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 625 మంది అభ్యర్థుల్లో ఎంత మంది ఉపసంహరించుకున్నారనేది కాసేపట్లో తేలనుంది. వివరాలను ఈసీ వెల్లడించనుంది. ఈ నెల 18 వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలు కార్యక్రమం కొనసాగింది. ఆ వెంటనే స్క్రూట్నీ నిర్వహించిన అధికారులు వివరాలు సరిగా లేని, అసంపూర్తిగా ఉన్న 268 నామినేషన్లను తిరస్కరించారు. ఈ నెల 26 నుంచి ఇవాళ సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణల పర్వం కొనసాగింది. ముఖ్యంగా ఎక్కువ మంది ఇండిపెండెంట్లు (Lok Sabha) నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రధాన పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు బుజ్జగించినట్టు తెలుస్తోంది. ఇవాళ రాత్రి కల్లా ఇండిపెండెంట్లకు గుర్తులు కేటాయించే అవకాశం ఉంది. నామినేషన్ల ప్రక్రి పూర్తి కావడంతో నేతలు ప్రచారంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అత్యధికంగా మల్కాజ్ గిరి నుంచి అత్యల్పంగా ఆదిలాబాద్ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. ఫైనల్ గా ఎంతమంది ఏ సెగ్మెంట్ లో బరిలో ఉన్నారు. స్వతంత్రులు, గుర్తింపు పొందని పార్టీల వారికి ఏ గుర్తులు కేటాయిస్తారనేది కాసేపట్లో తేలనుంది.
నామినేషన్ల ఉపసంహరణల పర్వం ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలిపోయింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు 893 నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇందులో 268 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 625 మంది అభ్యర్థుల్లో ఎంత మంది ఉపసంహరించుకున్నారనేది కాసేపట్లో తేలనుంది. వివరాలను ఈసీ వెల్లడించనుంది. ఈ నెల 18 వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలు కార్యక్రమం కొనసాగింది. ఆ వెంటనే స్క్రూట్నీ నిర్వహించిన అధికారులు వివరాలు సరిగా లేని, అసంపూర్తిగా ఉన్న 268 నామినేషన్లను తిరస్కరించారు. ఈ నెల 26 నుంచి ఇవాళ సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణల పర్వం కొనసాగింది. ముఖ్యంగా ఎక్కువ మంది ఇండిపెండెంట్లు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రధాన పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు బుజ్జగించినట్టు తెలుస్తోంది. ఇవాళ రాత్రి కల్లా ఇండిపెండెంట్లకు గుర్తులు కేటాయించే అవకాశం ఉంది. నామినేషన్ల ప్రక్రి పూర్తి కావడంతో నేతలు ప్రచారంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అత్యధికంగా మల్కాజ్ గిరి నుంచి అత్యల్పంగా ఆదిలాబాద్ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. ఫైనల్ గా ఎంతమంది ఏ సెగ్మెంట్ లో బరిలో ఉన్నారు. స్వతంత్రులు, గుర్తింపు పొందని పార్టీల వారికి ఏ గుర్తులు కేటాయిస్తారనేది కాసేపట్లో తేలనుంది.
Also read:

