Madhavilatha: రాజాసింగ్​పై పోటీకి సిద్ధం

Madhavilatha

బీజేపీ నేత మాధవీలత (Madhavilatha) మరోసారి వార్తల్లో నిలిచారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను టార్గెట్ చేస్తూ, పార్టీ టికెట్ ఇస్తే ఆయనపై పోటీ చేసి గెలుస్తానని సవాల్ విసిరారు. (Madhavilatha) ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “గోషామహల్‌లో నాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. రాజాసింగ్ కంటే నేనే బలమైన నాయకురాలిని” అని పేర్కొన్నారు.

రాజాసింగ్‌కు పార్టీలో మద్దతు లేదన్న ఆరోపణ

రాజాసింగ్ ఇటీవలే పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ, బీజేపీలో తనకు సపోర్ట్ లేదని అన్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మాధవీలత – “అయితే నాకు సహకరించకపోవడం ఎందుకు?” అని ప్రశ్నించారు.

ఆమె మాట్లాడుతూ –
“పార్టీనే కార్పొరేటర్‌ నుంచి ఎమ్మెల్యే చేశింది. అదే పార్టీ నాకు ఎందుకు న్యాయం చేయడం లేదు?” అని నిలదీశారు.

‘‘బూతులు తిట్టడం సనాతన ధర్మం కాదు’’

రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. “మహిళలపై అమర్యాదగా మాట్లాడడం, మతాలపై బూతులు తిట్టడం సనాతన ధర్మం కాదు. ఇది హిందూ సమాజానికి తలవంపు తెచ్చే చర్య” అని విమర్శించారు.

 బైపోల్ వస్తే సిద్ధమే!

జూబ్లీహిల్స్ గానీ, గోషామహల్ గానీ – ఎక్కడ బైపోల్ వచ్చినా తాను రెడీ అని మాధవీలత స్పష్టం చేశారు. పార్టీ టికెట్ ఇస్తే గెలిచేలా చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Also read: