మరో వివాదంలో మహమూద్ అలీ(Mahmood Ali)
కేసీఆర్ ను ఖలీఫా ఉమర్ తో పోల్చిన హోం మంత్రి
= నల్ల రిబ్బన్లు ధరించి ముస్లిం సంఘాల ఆందోళన
= ఖమ్మం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: హోంశాఖ మంత్రి మహమూద్ అలీ(Mahmood Ali) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం వచ్చిన ఆయన సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన పాలనలో మస్లింలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. ఇదే క్రమంలో కేసీఆర్ ను ఖలీఫా ఉమర్ తో పోల్చారు. ఇది కాస్తా వివాదానికి కారణమైంది. ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగాయి. షాదీఖానా ముందు నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపాయి. అక్కడి నుంచి వెళ్తున్న మహమూద్ అలీ(Mahmood Ali) కారును అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో రోప్ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. హోం మంత్రి తీరును నిరసిస్తూ ఖమ్మం వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్భంగా పూల బొకే తేలేదని వ్యక్తిగత భద్రతా సిబ్బంది చెంపచెళ్లు మనిపించిన హోం మంత్రి తాజాగా సాంత సామాజిక వర్గం నుంచి నిరసనను ఎదుర్కోవడం గమనార్హం.
Read More:

