Ponnam: కేంద్రం యూరియా ఇస్తలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

Ponnam

కేంద్రం యూరియా ఇవ్వకపోవడంపై మంత్రి (Ponnam) పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో స్పందించారు. యూరియా ఇచ్చిన పార్టీకి ఓటేస్తామని చెప్పిన బీఆర్ఎస్ (Ponnam) తమ అసలు వైఖరి ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు –
“బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రం నిర్లక్ష్యమే కారణం. మన రాష్ట్రంపై వివక్ష చూపుతోంది. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా, కేంద్రం పట్టించుకోవట్లేదు. రావాల్సిన కోటాను ఇవ్వడం లేదు. ఎరువుల తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం వారిదే. అయినా వారు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు” అని ఫైర్ అయ్యారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ –
“రాష్ట్రంలో యూరియా కొరత వాస్తవమే. కానీ, దాన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా పట్టించుకోవడం లేదు. రామగుండం ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగానే మూసేశారు. కేటీఆర్ యూరియా ఎవరిస్తే వాళ్లకే మద్దతు ఇస్తామని అంటున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు బిడ్డకు ఓటేయాలి” అని వ్యాఖ్యానించారు.

Also read: