తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేలాయి. ములుగు ఎమ్మెల్యే మరియు పంచాయతీరాజ్ శాఖా (Seethakka) మంత్రి సీతక్క (అనసూయ), బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ములుగులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు (Seethakka) దారితీశాయి.
🔹 “నీకు ధన బలం ఉండొచ్చు, నాకు ప్రజల బలం ఉంది!”
సీతక్క మాట్లాడుతూ,
“కేటీఆర్ నీకు ధన బలం, కుల బలం ఉండొచ్చు. కానీ నాకు నియోజకవర్గ ప్రజల మద్దతు ఉంది. సీయం గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడే అహంకారాన్ని తగ్గించుకో!”
అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆమెపై వస్తున్న విమర్శలకు గట్టి బదులిచ్చిన ఆమె,
“నియోజకవర్గంలో ‘ఇందిరమ్మ పాలన’ సాగుతుంది. ఎలాంటి నిర్బంధాలు లేవు. బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు అభివృద్ధి చూడలేక మింగలేక పోతుంది.”
అని మండిపడ్డారు.
🔹 “ఎన్నికల కోసం డ్రామాలు ఆపండి”
కేటీఆర్ ములుగు నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలు ఎన్నికల కోసం డ్రామాలు అని ఆమె స్పష్టం చేశారు.
“బీఆర్ఎస్ పాలనలో మా కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. ఇప్పుడు ఓడిపోయిన నాయకులు ములుగు వచ్చి డ్రామాలు చేస్తున్నారు”
అని మండిపడ్డారు.
🔹 “70 ఏళ్ల చరిత్రలోనే నేను తొలి కోయ మహిళా మంత్రి”
“70 ఏళ్ల చరిత్రలో పంచాయతీరాజ్ శాఖకు కోయ మహిళ మంత్రిగా నేను పని చేస్తున్నా. ఇది కొందరికి జీర్ణించుకోవడం కష్టమవుతోంది. అయినా ప్రజల విశ్వాసంతో ముందుకెళ్తాను.”
అని భావోద్వేగంగా తెలిపారు.
🔹 ములుగు ప్రత్యేకతపై హైలైట్
ములుగు నియోజకవర్గం గురించి మాట్లాడుతూ,
“ఇది ఉద్యమాల చరిత్ర కలిగి ఉన్న నియోజకవర్గం. సమ్మక్క–సారలమ్మ దేవస్థానం, అడవులు, ప్రత్యేక హెరిటేజ్ ఉన్న గొప్ప భూమి ఇది.”
అని పేర్కొన్నారు.
🔹 సమకాలీన రాజకీయ విమర్శలు
“సిరిసిల్లలో ఇసుక లారీలతో ప్రజలను తొక్కించి చంపినది ఎవరు? అడ్వకేట్లను హత్య చేసినది ఎవరు? బుట్టాయిగూడెం, చల్వాయిలో మృతులపై కేటీఆర్ స్పందించాల్సింది. దుబాయ్ నుంచి సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయడం మానేయాలి.”
అంటూ మరోసారి కేటీఆర్‌కి సవాల్ విసిరారు.
Also read:

