ప్రతి నెలా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. సర్కార్కొలువుల నోటిఫికేషన్లతో పాటు ఇతర కార్పొరేషన్ రంగాల్లో కాంపిట్యూటివ్ పరీక్షలు నిర్వహించి ఖాళీలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. పద్మ భూషణ్ డాక్టర్ వరప్రాద్ రెడ్డికి విశిష్ట పురస్కారం ప్రదానం సంతోషకరమన్నారు, తెలుగు భాషా, మన రాష్ట్ర నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా కృషి చేసిన మహనీయులకు ధన్యవాదాలు తెలిపారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం 39వ వ్యవస్థాపన దినోత్సవ వేడుకల్లో శ్రీధర్‌బాబు (Sridhar Babu)మాట్లాడారు.

‘ఏడాది పాలనలోనే కాంగ్రెస్సర్కార్అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి.. రాబోయే కాలంలో యువతకు ఉపాధి అవకాశం కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నం. మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మాది.100 కంప్యూటర్లు అతి త్వరలో కేటాయిస్తం. ఆర్టిఫిషియల్ రంగంలో యువ విద్యార్థులు నైపుణ్యం పెంపొందించే దిశగా ముందుకు పోవాలి’ అని సూచించారు.
Also read :

