ప్రధాని మోదీ తీసుకొచ్చిన రాజ్యాంగ చట్టం సీఏఏను అడ్డుకుంటే జైలుకు వెళ్లడం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Aravind) అన్నారు. ఇవాళ నిజామాబాద్‌లోని దుబ్బ ప్రాంతంలో చాయ్‌పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యంగ వ్యతిరేక పాలన చేస్తే రాష్ట్రపతి పాలన ఉందంటూ సీఏఏనే వ్యతిరేకిస్తున్న నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ దేశంలో 2 లక్షల రుణమాఫీ ఎలా చేస్తుందని ఎంపీ ఆర్వింద్ (MP Aravind) ప్రశ్నించారు.
ఓట్ల కోసం దేవుని పేరు చెబుతున్న కాంగ్రెస్ సీఏఏ, ఎన్ఆర్సీకి ఎందుకు ఒప్పుకోవడం లేదని నిలదీశారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ జైశ్రీరామ్ అంటుందోని ఎంపీ అర్వింద్ విమర్శించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేసి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి హిందువుల ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. పాతబస్తీలో బీజేపీని ఓడించేందుకు డమ్మీ అభ్యర్థిని కాంగ్రెస్ నిలబెడుతుందని ఆరోపించారు. మోదీని మూడోసారి పీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నిజామాబాద్‌కు ఐసీడీని తెచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే సీట్లు 400 దాటుతాయన్నారు. కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా వచ్చేది అనుమానమేనని ఆయన అన్నారు.

Also read:
- Biryani: పట్నమోళ్లే 10 లక్షల బిర్యానీలు తిన్నరు
- Rajamouli: జక్కన్న స్టెప్పులు!!
- Rakul: మాదాపూర్ లో రకుల్ రెస్టారెంట్!