Nirmal: ట్రాక్టర్​పై ఎస్పీ జానకి

Nirmal

నిర్మల్ (Nirmal) జిల్లా బాసరలో గోదావరి ఉధృతి పెరగడంతో తీరప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి ఎగసిపడటంతో వ్యాపార సంస్థలు, ఇళ్ళు జలమయం కాగా, స్థానికులు తీవ్ర ఇబ్బందులు (Nirmal) ఎదుర్కొన్నారు.

Image

ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ట్రాక్టర్‌పై ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పరిస్థితులను సమీక్షించి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అన్ని రకాల సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.

Image

ప్రస్తుతం గోదావరి ఉధృతి కొనసాగుతుండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

Also read: