Nirmala Sitharaman: చేనేత చీరలో నిర్మల

Nirmala Sitharaman

కేంద్ర మంత్రి (Nirmala Sitharaman ) నిర్మలా సీతారామన్‌ సందర్భానుసారంగా ఆమె ధరించే చీర అందరినీ ఆకర్షిస్తుంది. ఏటా బడ్జెట్‌ రోజున ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు ( Nirmala Sitharaman )నిర్మలా సీతారామన్. స్వతహాగా చేనేత చీరలను ఇష్టపడే ఆమె.. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ బడ్జెట్‌ సమావేశాలకు చేనేత చీరనే ధరిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా ఆమె ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈసారి ఆమె తెలుపు రంగు చీరలో పార్లమెంటుకు వచ్చారు. బంగారు మోటిఫ్‌లతో.. మెజెంటా బార్డర్‌తో కూడిన తెలుపు రంగు చెక్స్‌ చేనేత చీరలో హాజరవడం విశేషం. ఇక తెలుపు రంగు స్వచ్ఛతకు సామరస్యానికి భారతీయ సంస్కృతిలో కొత్త శకం ప్రారంభానికి శుభసూచికంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర ధరించారు. 2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ – బంగారు వర్ణంలో ఉన్న చీరను, 2021లో ఎరుపు – గోధుమ రంగు కలగలిసిన భూదాన్‌ పోచంపల్లి సారీని ధరించారు. 2022లో మెరూన్‌ కలర్‌ ఒడిశా చేనేత చీర కట్టుకున్నారు. రస్ట్‌ బ్రౌన్‌, డార్క్‌ మెరూన్‌ కలగలిసిన చీరకు ఆఫ్‌ వైట్‌ నేత బోర్డర్‌ మరింత ఆకర్ణణీయత తెచ్చింది. గతేడాది టెంపుల్‌ డిజైన్‌తో నలుపు, బంగారు వర్ణాల అంచుతో ఎరుపు రంగు చీర ధరించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో టస్సర్‌ హ్యాండ్లూమ్‌ బ్లూ, క్రీమ్‌ కలగలిపిన ‘రామా బ్లూ’ చేనేత చీరను ధరించారు.Union Budget 2024: FM Nirmala Sitharaman adorns white-violet silk saree;  here's a look at her iconic Budget-day sarees over the years | Trending  News - The Indian Express
వరుసగా ఏడోసారి
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర కేబినెట్ ఆమోదం తీసుకున్నారు. నిర్మలా సీతారామన్‌ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను పెట్టారు. దాంతో పార్లమెంట్‌లో వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె గుర్తింపు దక్కించుకున్నారు. పార్లమెంట్‌లో 2024 బ‌డ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిశారు. బడ్జెట్‌ సమర్పణకు ఆమె నుంచి అనుమతి తీసుకున్నారు. అంతకుముందు నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ‌ విభాగానికి వెళ్లిన నిర్మలమ్మ అక్కడి నుంచి బ‌హీఖాతా తీసుకువ‌చ్చారు. ఎరుపు రంగులో ఉన్న బ‌హీఖాతాలో బ‌డ్జెట్ వివరాలకు సంబంధించిన ట్యాబ్ ఉంది. చేనేత చీరలో నిర్మలImage
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ సందర్భానుసారంగా ఆమె ధరించే చీర అందరినీ ఆకర్షిస్తుంది. ఏటా బడ్జెట్‌ రోజున ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు నిర్మలా సీతారామన్. స్వతహాగా చేనేత చీరలను ఇష్టపడే ఆమె.. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ బడ్జెట్‌ సమావేశాలకు చేనేత చీరనే ధరిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా ఆమె ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈసారి ఆమె తెలుపు రంగు చీరలో పార్లమెంటుకు వచ్చారు. బంగారు మోటిఫ్‌లతో.. మెజెంటా బార్డర్‌తో కూడిన తెలుపు రంగు చెక్స్‌ చేనేత చీరలో హాజరవడం విశేషం. ఇక తెలుపు రంగు స్వచ్ఛతకు సామరస్యానికి భారతీయ సంస్కృతిలో కొత్త శకం ప్రారంభానికి శుభసూచికంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర ధరించారు. 2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ – బంగారు వర్ణంలో ఉన్న చీరను, 2021లో ఎరుపు – గోధుమ రంగు కలగలిసిన భూదాన్‌ పోచంపల్లి సారీని ధరించారు. 2022లో మెరూన్‌ కలర్‌ ఒడిశా చేనేత చీర కట్టుకున్నారు. రస్ట్‌ బ్రౌన్‌, డార్క్‌ మెరూన్‌ కలగలిసిన చీరకు ఆఫ్‌ వైట్‌ నేత బోర్డర్‌ మరింత ఆకర్ణణీయత తెచ్చింది. గతేడాది టెంపుల్‌ డిజైన్‌తో నలుపు, బంగారు వర్ణాల అంచుతో ఎరుపు రంగు చీర ధరించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో టస్సర్‌ హ్యాండ్లూమ్‌ బ్లూ, క్రీమ్‌ కలగలిపిన ‘రామా బ్లూ’ చేనేత చీరను ధరించారు.
వరుసగా ఏడోసారి
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర కేబినెట్ ఆమోదం తీసుకున్నారు. నిర్మలా సీతారామన్‌ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను పెట్టారు. దాంతో పార్లమెంట్‌లో వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె గుర్తింపు దక్కించుకున్నారు. పార్లమెంట్‌లో 2024 బ‌డ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిశారు. బడ్జెట్‌ సమర్పణకు ఆమె నుంచి అనుమతి తీసుకున్నారు. అంతకుముందు నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ‌ విభాగానికి వెళ్లిన నిర్మలమ్మ అక్కడి నుంచి బ‌హీఖాతా తీసుకువ‌చ్చారు. ఎరుపు రంగులో ఉన్న బ‌హీఖాతాలో బ‌డ్జెట్ వివరాలకు సంబంధించిన ట్యాబ్ ఉంది.

 

ALSO READ :