PCC Chief: వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు

PCC Chief

వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ ఉండదని (PCC Chief) పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అందుకే హరీశ్ రావు వేరే దారి వెతుక్కుంటున్నారని (PCC Chief) తెలిపారు. ఇప్పటికే ఆయన పక్కచూపులు చూస్తున్నారని.. బీఆర్ఎస్ లో చివరికి మిగిలేది కేసీఆర్, కేటీఆర్, కవిత మాత్రమేనన్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఏంటో హరీశ్ రావు చెప్పాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ గత 11 నెలల్లో చేసిన అభివృద్ధి ఎంటో చూపిస్తామన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదని తెలిపారు. సీఎం రేవంత్ ని వ్యతిరేకించినా అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదన్నారు. జనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని సూచించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన చెక్కు చెదరలేదని అన్నారు.

Image

కాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదని తెలిపారు. సీఎం రేవంత్ ని వ్యతిరేకించినా అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదన్నారు. జనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని సూచించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన చెక్కు చెదరలేదని అన్నారు.

Also read: