PCC Mahesh: ‘బండి’ది దిగజారుడు రాజకీయం

PCC Mahesh

కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని, ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిర్మ పేరెందుకు పెట్టొద్దని (PCC Mahesh) పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు. ఇందిరమ్మ త్యాగం ముందు బీజేపీ ఎంతన్నారు. బండి సంజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు (PCC Mahesh). రేపు రాష్ట్రంలో పేదలకు అతిపెద్ద పండుగ అని అన్నారు. ప్రారంభించబోయే నాలుగు పథకాలు నిజమైన లబ్ధిదారులకే అందాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులకే లబ్ధి జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. తమది చేతల ప్రభుత్వమని, ప్రతి హామీని నెరవేర్చి చూపుతున్నామని చెప్పారు. పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు తమ ప్రభుత్వం ఇస్తుంటే కడుపుమండి మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని క్లారిటీ ఇచ్చారు.

 

Image

కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని, ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిర్మ పేరెందుకు పెట్టొద్దని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు. ఇందిరమ్మ త్యాగం ముందు బీజేపీ ఎంతన్నారు. బండి సంజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేపు రాష్ట్రంలో పేదలకు అతిపెద్ద పండుగ అని అన్నారు. ప్రారంభించబోయే నాలుగు పథకాలు నిజమైన లబ్ధిదారులకే అందాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులకే లబ్ధి జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. తమది చేతల ప్రభుత్వమని, ప్రతి హామీని నెరవేర్చి చూపుతున్నామని చెప్పారు. పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు తమ ప్రభుత్వం ఇస్తుంటే కడుపుమండి మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని క్లారిటీ ఇచ్చారు.

Also read: