PONGULETI: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి PONGULETI సీఎం కేసీఆర్ పై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. అనేక మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. తొమ్మిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. మాయ మాటలు చెప్పి, గారడి చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం జిల్ల బయ్యారంలో కోరం కనకయ్య క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి PONGULETI ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అనేక మంది బలిదానాలు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయన్నారు. వాటిని అమలులో చేయడం లో విఫలమయ్యారని విమర్శించారు. ఈ గారడి మాటల ప్రభుత్వానికి కాలం దగ్గరపడిందన్నారు.
ప్రజాభీష్టం మేరకే రాజకీయ ప్రస్థానం
తన రాజకీయ ప్రస్థానంపైనా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి PONGULETI క్లారిటీ ఇచ్చారు. ప్రజాభీష్టం మేరకే తన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కుండ బద్దలు కొట్టారు. నాలుగేళ్లుగా పదవిలేకున్నా ప్రజల మధ్యలోనే ఉన్నానని చెప్పారు. ప్రజలే తనకు దేవుళ్లని వివరించారు. ప్రజాభిమానం ముందు అన్నీ దిగదుడుపేనని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొంగులేటి రాజకీయ ప్రస్థానంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. టీఆర్ఎస్ లో సాంకేతికంగా ఉన్నప్పటికీ ఆయనకు కీలక సమావేశాలకు ఆహ్వానం లేకపోవడం అందరికీ తెలిసిందే. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభకు పొంగులేటిని ఆహ్వానించకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంమైంది. అదే సమయంలో వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల.. తనకు పొంగులేటి టచ్ లోనే ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు మరో మారు సంచలనం రేకెత్తించాయి. ఆయన కూడా ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చుతూ .. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైఎస్సార్ టీపీలో చేరతారనే చర్చ జరగింది. ఆ తర్వాత ఆయన షర్మిల పార్టీలో చేరే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు.
ALSO READ :

