గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (RajaSingh) గణేశ్ నిమజ్జనాలపై కీలక ప్రకటన చేశారు. ఈ సంవత్సరం వినాయక నిమజ్జనం నగరంలో ప్రశాంతంగా ముగిసిందని, (RajaSingh) అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు విజయవంతమయ్యాయని తెలిపారు. పోలీస్, మున్సిపల్, ట్రాఫిక్ శాఖల సిబ్బంది చేసిన కృషిని ప్రశంసిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారని గుర్తు చేశారు.
అయితే, రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. వినాయక్ సాగర్ మురుగు నీటితో నిండిపోవడం వల్ల గణేశ్ విగ్రహాలు అక్కడ నిమజ్జనం చేయడం పాపమని వ్యాఖ్యానించారు. “ఆ నీటిని తప్పనిసరిగా మళ్లించాలి. వచ్చే సంవత్సరం గణేశ్ విగ్రహాలను వినాయక్ సాగర్‌లో వర్షపు నీటిలో నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలి. ఈ బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి తీసుకోవాలి” అని ఆయన సూచించారు.

Also read: