రాష్ట్రంలో (RainForecast) వాతావరణం మార్మోగుతోంది. ఒక వైపు ఎండలు మండుతుండగా, మరో వైపు వానలు ఆగిపోవడం లేదు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు (RainForecast) వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం సమయంలో తీవ్ర ఎండలు, సాయంత్రం వేళ క్యూమిలో నింబస్ మేఘాల ఏర్పాటుతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉష్ణతారతమ్యాల కారణంగానే సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.
ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే, ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. నవంబర్ రెండో వారం నుంచి చలి ప్రభావం క్రమంగా కనిపించే అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.
వర్షాల ప్రభావం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంటలను రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Also read:
- ChevellaTragedy: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
- MPVishweshwar: మర్రి చెట్ల కోసం మనుషుల ప్రాణాలు తీసిండ్రు
