Lok Sabha: రోజు వంద కోట్లు పట్కుంటుండ్రు

loksabha

Lok Sabha : లోక్ సభ(Lok Sabha) ఎన్నికల్లో భాగంగా మార్చి 1 నుంచి రోజుకు సగటున రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను సీజ్‌ చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా జరుపుతున్న తనిఖీల్లో ఇప్పటి వరకు మొత్తంగా రూ.4650 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. వీటిలో 45 శాతం విలువ మాదక ద్రవ్యాలదే కావడం గమనార్హం. ఈసారి స్వాధీనం చేసుకున్న మొత్తం.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్ల కంటే ఎక్కువని ఈసీ పేర్కొంది. సమగ్ర ప్రణాళిక, సహకారం, ఏజెన్సీల నుంచి ఏకీకృత నిరోధక చర్యలు, ప్రజల భాగస్వామ్యంతోపాటు ఆధునిక టెక్నాలజీని సమర్థంగా వినియోగించడంతోనే రికార్డ్‌ స్థాయిలో నగదు, ఇతర వస్తువులు పట్టుకోవడం సాధ్యమైందని ఎలక్షన్‌ కమిషన్‌ వివరించింది. దేశవ్యాప్తంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, నిఘా బృందాలతో సహా సరిహద్దు చెక్‌పోస్టులు నిరంతరం పనిచేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. మాదకద్రవ్యాల రవాణాతోపాటు నగదు, మద్యం, తాయిలాల పంపిణీని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మార్చి 1 నుంచి రోజుకు సగటున రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను సీజ్‌ చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా జరుపుతున్న తనిఖీల్లో ఇప్పటి వరకు మొత్తంగా రూ.4650 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. వీటిలో 45 శాతం విలువ మాదక ద్రవ్యాలదే కావడం గమనార్హం. ఈసారి స్వాధీనం చేసుకున్న మొత్తం.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్ల కంటే ఎక్కువని ఈసీ పేర్కొంది. సమగ్ర ప్రణాళిక, సహకారం, ఏజెన్సీల నుంచి ఏకీకృత నిరోధక చర్యలు, ప్రజల భాగస్వామ్యంతోపాటు ఆధునిక టెక్నాలజీని సమర్థంగా వినియోగించడంతోనే రికార్డ్‌ స్థాయిలో నగదు, ఇతర వస్తువులు పట్టుకోవడం సాధ్యమైందని ఎలక్షన్‌ కమిషన్‌ వివరించింది. దేశవ్యాప్తంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, నిఘా బృందాలతో సహా సరిహద్దు చెక్‌పోస్టులు నిరంతరం పనిచేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. మాదకద్రవ్యాల రవాణాతోపాటు నగదు, మద్యం, తాయిలాల పంపిణీని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.

 

Also read: