Tukkuguda:నమో అంటే నమ్మితే మోసం

Tukkuguda

నమో అంటే నరేంద్ర మోదీ కాదని, నమ్మితే మోసం చేయడం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ తుక్కుగూడ (Tukkuguda) వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ పదేండ్లు ప్రధానిగా ఉండి తెలంగాణకు ఏమీ చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన హామీలను మోదీ విస్మరించారని చెప్పారు. (Tukkuguda) ఏడు మండలాలను బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఏడంతస్తుల మేడ బలంగా ఉండాలంటే పునాదులు బలంగా ఉండాలె.. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే మీరు సైనికులుగా నిలబడి కొట్లాడాలె.. ఎన్ని కేసులు పెట్టినా మీ చెమటను రక్తంగా మార్చారు. మీ కష్టం , త్యాగం, శ్రమ తోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది.

ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నం .. తెలంగాణ స్ఫూర్తితో, వైబ్రేంట్ తెలంగాణ నినాదంతో ముందుకు పోదాం.. గుజరాత్ మోడల్ మీద తెలంగాణ ఆధిపత్యాన్ని చాటుతుంది. దక్షిణ భారతం, ఉత్తర భారతం మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావడానికి నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తుండు.. ఆ కుట్రలను తిప్పి కొట్టాలె. బీజేపీకి ఓటేస్తా.. ఆయన చంద్రమండలానికి రాజైతడా..? అని ప్రశ్నించారు. వరదలు వచ్చి హైదరాబాద్ ముంపునకు గురైతే సిగ్గులేని కిషన్ రెడ్డి ఏం చేసిండని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా రూపాయి తీసుకు రాలేదని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడితే దేశం సుభిక్షంగా ఉంటుందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పారు.

Also read: