Kishan reddy: ప్రపంచాన్నే శాసిస్తున్నం

Kishan reddy

ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఇండియా చేరుకుందని, 75 దేశాలకు డిఫెన్స్​పరికరాలు ఎగుమతి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి (Kishan reddy) అన్నారు. యువశక్తి సాయంతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చనని తెలిపారు. కింగ్ కోఠి భారతీయ విద్యా భవన్ లోని నిర్వహించిన రోజ్‌గార్‌ మేళాలో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఎంపికైన 155 మందికి నియామక పత్రాలు అందించారు. అనంతరం (Kishan reddy) కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘కేంద్ర విభాగాల్లో ఖాళీలు ఉండకూడదనే ప్రతి నెలా రోజ్‌గార్‌ మేళా నిర్వహిస్తున్నం. ఇవాళ దేశవ్యాప్తంగా 51 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేస్తున్నం.

Image

ఇదొక నిరంతర ప్రక్రియ.. 12 లక్షల ఉద్యోగాలు టార్గెట్ గా పెట్టుకుని.. దీన్ని పూర్తిచేసే దిశగా కేంద్రం ముందుకెళ్తోంది. వికసిత్‌ భారత్‌ దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధునాతన సాంకేతికను విద్యావిధానంలోకి కేంద్రం తీసుకొచ్చింది. 14 కీలక రంగాలకు లక్షా 97వేల కోట్లను పీఎల్ఐగా అందించింది. దీని ద్వారా 60 లక్షల ఉద్యోగాలు టార్గెట్ గా పెట్టుకుంది. అనేక దేశాల్లో యువత తగ్గుతోంది.. మనవద్ద పుష్కలంగా ఉంది. ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నరు. శాంతిభద్రతలు సరిగా లేకుంటే దేశంలోకి పెట్టుబడులు రావు. ఉగ్రవాద చర్యలపై కఠినంగా వ్యవహరిస్తున్నం. వ్యవసాయ విధానాల్లో మార్పులు తెస్తున్నం. విద్యుత్‌ కొరత లేకుండా చర్యలు తీసుకున్నం. విద్యుదుత్పత్తి పెంచి అన్ని రంగాల అభివృద్ధికి సహకరిస్తున్నం’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

Image

ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఇండియా చేరుకుందని, 75 దేశాలకు డిఫెన్స్​పరికరాలు ఎగుమతి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. యువశక్తి సాయంతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చనని తెలిపారు. కింగ్ కోఠి భారతీయ విద్యా భవన్ లోని నిర్వహించిన రోజ్‌గార్‌ మేళాలో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఎంపికైన 155 మందికి నియామక పత్రాలు అందించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘కేంద్ర విభాగాల్లో ఖాళీలు ఉండకూడదనే ప్రతి నెలా రోజ్‌గార్‌ మేళా నిర్వహిస్తున్నం. ఇవాళ దేశవ్యాప్తంగా 51 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేస్తున్నం. ఇదొక నిరంతర ప్రక్రియ.. 12 లక్షల ఉద్యోగాలు టార్గెట్ గా పెట్టుకుని.. దీన్ని పూర్తిచేసే దిశగా కేంద్రం ముందుకెళ్తోంది. వికసిత్‌ భారత్‌ దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధునాతన సాంకేతికను విద్యావిధానంలోకి కేంద్రం తీసుకొచ్చింది. 14 కీలక రంగాలకు లక్షా 97వేల కోట్లను పీఎల్ఐగా అందించింది. దీని ద్వారా 60 లక్షల ఉద్యోగాలు టార్గెట్ గా పెట్టుకుంది. అనేక దేశాల్లో యువత తగ్గుతోంది.. మనవద్ద పుష్కలంగా ఉంది. ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నరు. శాంతిభద్రతలు సరిగా లేకుంటే దేశంలోకి పెట్టుబడులు రావు. ఉగ్రవాద చర్యలపై కఠినంగా వ్యవహరిస్తున్నం. వ్యవసాయ విధానాల్లో మార్పులు తెస్తున్నం. విద్యుత్‌ కొరత లేకుండా చర్యలు తీసుకున్నం. విద్యుదుత్పత్తి పెంచి అన్ని రంగాల అభివృద్ధికి సహకరిస్తున్నం’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

 

 

 

Also read: